విడుదల తేదీ : అక్టోబర్ 18, 2019
మూవీ మస్తీ.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : అనురాగ్ కొణిదెన,శ్వేతా అవస్థి, కైరవి టక్కర్, అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ, తదితరులు.


దర్శకత్వం : హేమంత్ కార్తీక్
నిర్మాత‌లు : కె. కోటేశ్వరరావు
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : సత్య గిడుతూరి

అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయమవుతూ హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ”మళ్ళీ మళ్ళీ చూశా”. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైన్మెంట్ నేడు విడులైంది. మళ్ళీ మళ్ళీ చూశా చిత్రం తో ఈ కొత్త టీం చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలించిందో సమీక్షలో చూద్దాం.

కథ: గౌతమ్(అనురాగ్ కొణిదెన)ఆర్మీ మేజర్ (అజయ్) ఇంట్లో పెరిగిన ఓ అనాధ.స్వప్న (స్వప్న అవస్థి) రాసిన ఓ ప్రేమకథకు సంబందించిన బుక్ అతనికి దొరుకుతుంది. ఆ ప్రేమకథలోని పాత్రలో తననే ఊహించుకుంటూ, ఆ పుస్తకం రాసిన స్వప్న ప్రేమలో పడిపోతాడు. ఆ పుస్తకం స్వప్నకు ఇవ్వాలని, ఆమెను కలవాలని వైజాగ్ నుండి హైదరాబాద్ వెళతాడు. మరి గౌతమ్, స్వప్న ను కలిశాడా? ఆ పుస్తకం తనకు అందించాడా? గౌతమ్ ప్రేమను స్వప్న అంగీకరించిందా? చివరికి వీరి కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్స్
అజయ్
కామెడీ బామ్ చిక్

మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
ఓల్డ్ రొటీన్ స్టోరీ

సాంకేతిక విభాగం: స్టోరీ పాతదైనప్పటికీ చక్కని ఆకట్టుకొనే స్క్రీన్ ప్లే కారణంగా హిట్ అయిన సినిమాలు అనేకం. రెండు భిన్నమైన ప్రేమకథలను చూపించే ప్రయత్నంలో దర్శకుడు హేమంత్ కార్తీక్ ఎటుపోయి ఎటువచ్చారో ఎవరికీ అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన తీరు చూస్తే ఆయన అసలు ట్రెండ్ ఫాలో అవుతున్నారా లేదా? అనిపిస్తుంది.

సంగీత దర్శకుడు శ్రవణ్ భార్గవ్ పాటలు పర్లేదు అనిపించినా, బీజీఎమ్ మాత్రం ఆకట్టుకోదు, కొంత మేర సినిమాటోగ్రఫీ అలరిస్తుంది, ఎడిటింగ్ ఘోరం గా ఉంది. నిర్మాణ విలువలు ఒక చిన్న సినిమాకి తగ్గట్లు పర్లేదు అన్నట్లుగా ఉన్నాయి.

తీర్పు:  ఈ ‘మళ్ళీ మళ్ళీ చూశా’ మూవీ  ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here