మాస్ మహా రాజ ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 


ఇటీవల విడుదలైన డిస్కో రాజా సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా  ఈ చిత్ర కొత్త టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. రవితేజ డైనమిక్ గా కనిపిస్తున్న ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. జనవరి 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయబోతున్నారు. జనవరి 24 న డిస్కో రాజా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here