వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 15-18-24లవ్ స్టోరీ. మాజేటి మూవీ మేకర్స్ కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్ దేవాదుల‌(బాహుబలి ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా విడుదల చేసి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. అలాగే టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈసందర్భంగా దర్శకుడు మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – లేటెస్ట్‌గా ఎఫ్‌2, అశ్వథ్ధామ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహ్రిన్ మా చిత్రంఫస్ట్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మా యూనిట్ తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. కథానుగుణంగా కులుంమనాలి, గోవా,ఒంగోలు, కేర‌ళ‌, హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని ప‌లు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. వైవిధ్యమైన కథా కథనాలతో సాగే ఈ చిత్రానికి ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవ‌ల‌ ఈ సన్నివేశాన్ని ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు.

నిఖిల్ (బాహుబలి ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి

సహనిర్మాతలు: బి వి శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్,
నిర్మాతలు: స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్,
దర్శకత్వం:మాడుపూరి కిరణ్ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here